కత్తిరించిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆసుపత్రికి వెళ్లిన మహిళ

రాజస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ భూమి వివాదంలో గొడవలో ఆమె మేనల్లుడు, ఇతర బంధువులు ఆమె ముక్కును కత్తిరించారు.

By అంజి  Published on  19 Dec 2024 1:38 AM GMT
Rajasthan woman, hospital, nose in bag, Viral news

కత్తిరించిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆసుపత్రికి వెళ్లిన మహిళ

రాజస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ భూమి వివాదంలో గొడవలో ఆమె మేనల్లుడు, ఇతర బంధువులు ఆమె ముక్కును కత్తిరించారు. జలోర్‌లోని సైలాకు చెందిన కుకీ దేవి అనే మహిళ బుధవారం పాలిలో.. కత్తిరించిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని ఆస్పత్రిక వెళ్లింది. కుకీ దేవి గత కొన్ని రోజులుగా సైలాలోని మోక్ని గ్రామంలోని తన తల్లి ఇంట్లో నివసిస్తోంది. గ్రామంలోని ఒక స్థలం విషయంలో ఆమె మామ, ఆమె మేనల్లుడు మధ్య భూమి వివాదం ఉంది.

మంగళవారం ఆమె తన కోడలు, కొడుకుతో కలిసి భూమిని సందర్శించినప్పుడు, ఆమె మేనల్లుడు ఓంప్రకాష్, ఇతర బంధువులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవలో ఓంప్రకాష్ కత్తితో కుకీదేవి ముక్కు కోసేశాడు. ఆ తర్వాత ఆమె కోసిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని పాలిలోని బంగర్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లింది. కుకీదేవికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. బంగర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జుగల్ మహేశ్వరి మాట్లాడుతూ.. ఆమె ముక్కు తీవ్రంగా కత్తిరించబడిందని, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మాత్రమే దానిని తిరిగి అమర్చవచ్చని తెలిపారు.

Next Story