షాకింగ్ వీడియో.. న్యూస్ పేప‌ర్ చ‌దువుతూ కుప్ప‌కూలిన వ్యాపారి

Rajasthan Businessman Dies While Reading Newspaper.వ్యాపారి కుర్చీలో కూర్చోని పేప‌ర్ చ‌దువుతూ కుప్ప‌కూలి మ‌ర‌ణించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 9:03 AM IST
షాకింగ్ వీడియో.. న్యూస్ పేప‌ర్ చ‌దువుతూ కుప్ప‌కూలిన వ్యాపారి

అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంటారు. అంద‌రితో బాగానే మాట్లాడుతారు. అయితే.. ఉన్న‌ట్లుండి ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌నలు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌డం తీవ్ర క‌ల‌వ‌రం పెడుతోంది. ఘ‌జియాబాద్‌లో కుర్చీలో కూర్చోనే జిమ్ ట్రైన‌ర్ ప్రాణాలు వ‌దిలిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే రాజస్థాన్ రాష్ట్రంలోని బ‌డ్మేర్‌లో అలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. పంటి నొప్పిరావ‌డంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యాపారి అక్క‌డ కుర్చీలో కూర్చోని పేప‌ర్ చ‌దువుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మ‌ర‌ణించాడు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్‌లో దిలీప్‌కుమార్ మ‌దాని(61) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. వ‌స్త్ర వ్యాపారం చేస్తుంటాడు. ఓ సామాజిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఈ నెల 4న రాజ‌స్థాన్ రాష్ట్రంలోని బ‌డ్మేర్‌కు వ‌చ్చారు. అత‌డికి పంటి నొప్పి రావ‌డంతో శ‌నివారం దంత‌ వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లాడు.పేషంట్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో త‌న వంతు కోసం ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో వెయిట్ చేస్తున్నాడు.

బెంచీపై కూర్చుని వార్తా ప‌త్రిక చ‌దువుతున్నారు. ఈ క్ర‌మంలో అసౌక‌ర్యానికి గురై అలా కొన్ని క్ష‌ణాలు ఆగిపోయిన ఆయ‌న బెంచీపై నుంచి కింద‌ప‌డిపోయారు. వెంట‌నే ఆస్ప‌త్రి సిబ్బంది ఆయ‌న వ‌ద్ద‌కు చేరుకుని సాయం అందించేందుకు ప్ర‌య‌త్నించారు. వేరే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మొత్తం దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు కాగా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story