పాక్‌లో కూతురు తలపై సీసీ కెమెరా పెట్టిన తండ్రి.. ఆమె రక్షణ కోసమే!
పాక్‌లో వలీద్ సాహబ్ అనే వ్యక్తి తన కూతురు తలపై సీసీ కెమెరాను అమర్చి వార్తల్లో నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 9 Sep 2024 5:00 AM GMTఅమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు బయటకు వెళ్తేనే ఇంట్లో తల్లిదండ్రులు కంగారు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు. అతని ఆలోచనపై కొంతమేర విమర్శలు వస్తున్నా.. అతని కూతురు మాత్రం స్వాగతిస్తోంది. తన కూతురుని ఎప్పుడూ సంరక్షించుకునేందుకు ఆమె తలపై ఏకంగా సీసీ కెమెరాను అమర్చాడు. దీని ద్వారా 24/7 తన కూతురు క్షేమంగా ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వలీద్ సాహబ్ అనే వ్యక్తి తన కూతురు తలపై సీసీ కెమెరాను అమర్చి వార్తల్లో నిలిచాడు. సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన తండ్రి ఆమె ప్రైవసీని దెబ్బతీస్తున్నారా అంటూ పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను అంగీకరిస్తానని పేర్కొంది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది. ఎవరైనా తనను యాక్సిడెంట్‌లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తలపై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు యువతి పేర్కొంది. కాగా.. కరాచీలో ఇటీవల తండ్రి, కూతురు వెళ్తున్న వాహనాన్ని ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు.
Pakistan🫡😭
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 6, 2024
pic.twitter.com/Hdql8R2ejt