అయ్యో.. క్రికెట్‌ బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే (వీడియో)

ఓ ఎమ్మెల్యే క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా తానూ బ్యాటింగ్ చేయాలని అనుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  29 Dec 2023 4:16 PM IST
mla,  cricket,  injured, odisha,

అయ్యో.. క్రికెట్‌ బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే (వీడియో)

ఓ ఎమ్మెల్యే క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా తానూ బ్యాటింగ్ చేయాలని అనుకున్నారు. తన టాలెంట్‌ చూపించాలని భావించారు. కానీ.. ఆ ఆలోచనే ఎమ్మెల్యేను ఇబ్బందిలో పడేసింది. బ్యాటింగ్ చేయబోయి అదుపుతప్పి ఒక్కసారిగా బొక్కబోర్లా పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్‌ ఇటీవల కలహండిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకుల్లో హుషారు నింపాలని భావించారు. క్రికెట్‌ పిచ్‌.. బ్యాట్‌... బాల్‌ను చూడగానే తన చిన్నతనం గుర్తొచ్చింది కాబోలు. వెంటనే తానూ బ్యాటింగ్ చేసి తనలో ఉన్న టాలెంట్‌ను చూపించాలనుకున్నారు. బ్యాట్‌ పట్టుకుని క్రికెట్‌ ఆడాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు బాల్‌ వేయగా.. బ్యాట్‌తో బిగ్‌ షాట్‌ కొట్టబోయాడు. బలంగా బ్యాట్‌ను ఊపాడు. ఈ క్రమంలో అదుపుతప్పి గింగిరాలు తిరుగుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలా కిందపడ్డ సమయంలో ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్‌ ముఖం నేలను గట్టిగా తాకింది.

ఈ సంఘటనతో చుట్టూ ఉన్నవారంతా వెంటనే అలర్ట్‌ అయ్యారు. ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్‌ను పైకి లేపారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ తలకు, ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే అడ్మిట్‌ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలకే పరిమితం అయితే బావుటుంది.. లేదంటే ఇలాంటివే జరుగుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story