హన్మకొండలో వింత ఘటన.. చనిపోయాడని పైకి లేపితే షాక్‌ (వీడియో)

హన్మకొండ జిల్లాలో వింత సంఘటన వెలుగు చూసింది.

By Srikanth Gundamalla
Published on : 10 Jun 2024 6:43 PM IST

man, sleep,  water, hanamkonda, viral video,

హన్మకొండలో వింత ఘటన.. చనిపోయాడని పైకి లేపితే షాక్‌ (వీడియో)

హన్మకొండ జిల్లాలో వింత సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నీటిలో తేలుతూ కనిపించాడు. దాంతో.. అతని చూసిన వ్యక్తులు చనిపోయాడని అనుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అక్కడికి వచ్చి చూసిన పోలీసులు నీటిలో ఉన్న వ్యక్తిని చేయి పట్టుకుని లాగారు.. వెంటనే అతను లేచి చూడటంతో అంతా షాక్‌ అయ్యారు.

హన్మకొండ నగరంలోని రెండో డివిజన్‌ రెడ్డిపురం కోవెలకుంటలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలో ఉండిపోయి ఉన్నాడు. ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. తమకు ఎందుకొచ్చిన గొడవ అని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరో చనిపోయి పడిఉన్నట్లు చెప్పారు. దాంతో.. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికీ నీటిలోనే పడి ఉన్న వ్యక్తిని లేపే ప్రయత్నం చేశారు. ఇక చేతి పట్టుకుని లాగగానే.. వెంటనే అతను లేచి నిల్చున్నాడు. దాంతో.. స్థానికులతో పాటు పోలీసులు కూడా షాక్‌ అయ్యారు. తీరా అతన్ని గమనించి.. మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. వివరాలను అడగ్గా.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా చెప్పాడు. ఇక అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story