శుభ‌మా అని కారు కొని ఇంటికి తీసుకువ‌స్తే ఇలా జ‌రిగిందేటి..?

Man Crashes Brand New Car Into Parked Bikes.ఓ వ్య‌క్తి కారును కొని అందులో తీరా ఇంటి ద‌గ్గ‌రికి వ‌చ్చాక ఊహించ‌ని అనుభ‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 3:10 AM GMT
శుభ‌మా అని కారు కొని ఇంటికి తీసుకువ‌స్తే ఇలా జ‌రిగిందేటి..?

సాధార‌ణంగా కొత్త కారు కొన‌డం ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. ఆ కారులో ఇంటికి వ‌స్తున్న‌ప్పుడు ఉండే ఆనంద‌మే వేరు. అలా ఓ వ్య‌క్తి కారును కొని అందులో తీరా ఇంటి ద‌గ్గ‌రికి వ‌చ్చాక ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. గేటు నుంచి లోప‌లికి రాగానే కారు నియంత్రించ‌డంలో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్య‌క్తి విఫ‌లం అయ్యాడు. ప‌క్క‌నే పార్క్ చేసిన బైక్‌ల‌ను ఢీ కొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఎలాంటి గాయాలు కాన‌ప్ప‌టికి ద్విచ‌క్ర‌వాహ‌నాలు మాత్రం ధ్వంసం అయ్యాయి.

ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌న‌ప్ప‌టికీ.. వినోద్ కుమార్ అనే మాజీ వైమానిక అధికారి సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. 'వాట్ ఏ గ్రాండ్ అరైవల్ హోమ్' అని క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి బ్రేక్‌కు బదులుగా యాక్సిల‌రేట‌ర్ నొక్కి ఉంటాడని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. ఇలాంటి ఘ‌న‌స్వాగ‌తాన్ని తామెప్పుడూ చూడ లేద‌ని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it