అస‌లైన‌ బాహుబ‌లి.. బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సెక్కాడు.. వీడియో వైర‌ల్‌

Man Climbs Bus Ladder With Motorbike On His Head.ఓ వ్య‌క్తి మాత్రం అవ‌లీల‌గా బైక్ లేపి త‌న నెత్తిన పెట్టుకుని బ‌స్సు పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2022 3:02 PM IST
అస‌లైన‌ బాహుబ‌లి..  బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సెక్కాడు.. వీడియో వైర‌ల్‌

బైక్‌ను న‌డ‌ప‌మంటే చాలా అవ‌లీల‌గా న‌డిపేస్తుంటారు. కొంద‌రు బైక్ పై స్టంట్స్ కూడా చేస్తుంటారు. అయితే.. అదే బైక్‌ను లేపి నెత్తిన పెట్టుకోమ‌ని చెబితే ఎంత మంది ఇలా చేయ‌గ‌ల‌రు..? చాలా క‌ష్టం క‌దా..! అయితే.. ఓ వ్య‌క్తి మాత్రం అవ‌లీల‌గా బైక్‌ను లేపి త‌న నెత్తిన పెట్టుకుని బ‌స్సు పై భాగంపైకి ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

'గుల్జార్ సాహబ్' అనే యూజ‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ వీడియోను శుక్ర‌వారం షేర్ చేశారు. నిజంగా 'సూపర్ హ్యూమన్' అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. క్ష‌ణాల్లోనే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు 89 వేల మంది వీక్షించ‌గా, 5 వేల‌కు పైగా లైక్‌లు వ‌చ్చాయి.

ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తలపై బైక్‌ను పెట్టుకుని న‌డుచుకుంటూ బ‌స్సు వ‌ద్ద‌కు వ‌చ్చాడు. బ‌స్సుకు ఎడ‌మ ప‌క్క‌గా ఇనుప గ్రిల్స్‌తో ఏర్పాటు చేసిన నిచ్చ‌న మెట్ల‌ను ఒక్కొక్క‌టిగా ఎక్కాడు. ఈ క్ర‌మంలో బైక్‌ను జాగ్ర‌త్త‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ బ‌స్ పైకి చేరుకున్నాడు. బ‌స్సు క్యారియ‌ర్‌పై బైక్‌ను వేశాడు.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'నిజమైన బాహుబ‌లి' ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. 'నిజ‌మైన సూప‌ర్ హీరో..' అంటూ అత‌డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

అయితే.. ఇది ఎక్క‌డ, ఎప్పుడు జ‌రిగిందో తెలియ‌రాలేదు.

Next Story