దోశ లేదన్నందుకు కత్తితో దాడి చేసి వ్యక్తి హంగామా

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. అదీ దోశ లేదని చెప్పినందుకు రచ్చ రచ్చ చేశాడు.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 4:05 PM IST
Man Attack,  Dosa, Medak, Viral Video,

దోశ లేదన్నందుకు కత్తితో దాడి చేసి వ్యక్తి హంగామా

మనుషులు ఒక్కోసారి కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు. క్షణికావేశంలో మర్డర్లు చేసి కటకటాల పాలైనవారు చాలా మంది ఉన్నారు. కొందరు వ్యక్తులు చిన్నవిషయాలకు కూడా ఎక్కువ కోపం తెచ్చుకుని అరుస్తారు. చేతిలో ఉన్న వస్తువలు, లేదంటే పక్కన ఏవైనా ఉంటే విసిరికొడతారు. ఈ క్రమంలోనే మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. అదీ దోశ లేదని చెప్పినందుకు రచ్చ రచ్చ చేశాడు.

మెదక్‌ జిల్లాలో జరిగింది ఈ ఘటన. రామాయంపేట బీసీ కాలనీలో మర్కు స్వామి అనే యువకుడు ఉదయం స్థానికంగా ఉన్న హోటల్‌కు వెళ్లాడు. టిఫిన్‌ కావాలని దోశలు తింటానని చెప్పాడు. దానికి హోటల్‌ నిర్వాహకులు తమ దగ్గర దోశలు లేవని చెప్పారు.దీంతో.. స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. హోటల్ నిర్వాహకులతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. క్షణికావేశంలో స్వామి అందుబాటులో ఉన్న కత్తి అందుకున్నాడు. హోటల్‌ యజమానురాలిపై దాడికి యత్నించాడు. ఈ సంఘటనతో అక్కడే ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. సదురు బాధితురాలు అరుస్తూ బయటకు పరుగు తీసింది. స్థానికులంతా గుమిగూడారు. హోటల్‌ యజమానురాలు స్వామి గల్లా పట్టుకుని తిట్టింది. అయినా కూడా స్వామి ఏ మాత్రం తగ్గకుండా బూతులు తిట్టాడు. ఈ ఘటన తర్వాత స్థానికులు, హోటల్‌ నిర్వాహకులు స్వామిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దోశ అడిగితే లేదని చెప్పింనందుకు కత్తితో నానా హంగామా చేశాడన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది.

Next Story