Video: కొడుకు సీఏ పరీక్షలో ఉత్తీర్ణత.. కన్నీళ్లు పెట్టుకున్న కూరగాయల వ్యాపారి

మహారాష్ట్రలోని డోంబివిలీ ఈస్ట్‌లో కూరగాయల వ్యాపారి అయిన నీరా తొంబరే.. ఆమె కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో భావోద్వేగం చెందారు.

By అంజి  Published on  15 July 2024 11:59 AM GMT
Maharashtra, vegetable vendor, CA exam, Ravindra Chavan

Video: కొడుకు సీఏ పరీక్షలో ఉత్తీర్ణత.. కన్నీళ్లు పెట్టుకున్న కూరగాయల వ్యాపారి 

మహారాష్ట్రలోని డోంబివిలీ ఈస్ట్‌లో కూరగాయల వ్యాపారి అయిన నీరా తొంబరే.. ఆమె కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో భావోద్వేగం చెందారు. తల్లి నీరా.. తన కొడుకు యోగేష్‌ను కౌగిలించుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి రవీంద్ర చవాన్ వీడియోను నెట్టింట షేర్‌ చేశారు. యోగేష్ తన విద్యా విషయాలలో రాజీ పడకుండా ఉండేలా నీరా థొంబరే చాలా కష్టపడ్డారు.

యోగేష్ తన దృఢ సంకల్పం, కృషితో తన సత్తాను నిరూపించుకోవడంతో అత్యద్భుతంగా ఉత్తీర్ణత సాధించాడు. యోగేష్ తన ఫలితం గురించి తెలుసుకున్న తర్వాత, నేరుగా తన తల్లి కూరగాయల దుకాణానికి వెళ్లి తన విజయాన్ని ఆమెకు చెప్పాడు. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయిన అత్యంత ఉద్వేగభరితమైన క్షణాలలో ఇది ఒకటి. ఎక్స్‌ పోస్ట్‌లో అతనిని అభినందిస్తూ మంత్రి రవీంద్ర చవాన్ ఇలా అన్నాడు. ''యోగేష్, మీ గురించి గర్వపడుతున్నాను. దృఢ సంకల్పం, కృషితో, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ యోగేష్ ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు'' అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా యోగేష్ వీడియోను షేర్ చేసి, అతని పెద్ద ఫీట్‌కు అభినందనలు తెలిపారు. యోగేష్ తన తల్లితో కలిసి డోంబివిలి సమీపంలోని ఖోని అనే గ్రామంలో నివసిస్తున్నాడు. నీరా తొంబరే గత 25 ఏళ్లుగా డోంబివిలిలోని గాంధీనగర్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా యోగేష్ సాధించిన విజయం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అతని తల్లి యొక్క తిరుగులేని మద్దతు, అంకితభావానికి గుర్తింపు.

Next Story