ఈ వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం.. టూరిస్టుల‌పైకి జంప్ చేసిన సింహం.. ఆత‌రువాత‌

Lioness jumps inside safari vehicle in viral video.సింహాం.. ఈ పేరు వింటే చాలు వెన్నులో వ‌ణుకు పుట్ట‌డానికి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 8:33 AM GMT
ఈ వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం.. టూరిస్టుల‌పైకి జంప్ చేసిన సింహం.. ఆత‌రువాత‌

సింహం.. ఈ పేరు వింటే చాలు వెన్నులో వ‌ణుకు పుట్ట‌డానికి. దాన్ని దూరం నుంచి చూస్తే ఫ‌ర్వాలేదు గానీ.. అది మ‌న ప‌క్క‌న నిల‌బ‌డితే. మ‌నం ప్ర‌యాణిస్తున్న వాహ‌నంలోకి అది ఎక్కి మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే.. ఏముంది..? ఒక్క‌సారిగా గుండె ఆగినంత ప‌ని అవుతుంది క‌దా..! అలాంటి అనుభ‌వాన్ని పొందారు కొంద‌రు టూరిస్టులు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూస్తూనే మ‌న ఒళ్ళు జ‌ల‌ద‌రించ‌డం ఖాయం.

కొంద‌రు టూరిస్టులు ఓపెన్ టాప్‌ వాహ‌నంలో పార్కులో ప్ర‌యాణిస్తున్నారు. వాళ్లు వెలుతుండ‌గా.. ఓ సింహం వారి వాహ‌నాన్నిచూసి ఒకేసారి చంపి తినేద్దాం అన్నంత వేగంగా వ‌చ్చింది. వాహ‌నంలోకి దూకేసింది. అయితే.. ఆ సింహం ఎవ్వ‌రిని ఏమీ చేయ‌లేదు. పైగా వాహ‌నంతో ఉన్న వారంద‌రినీ ప్రేమ‌గా ఆలింగంనం చేసుకుంటూ టూరిస్టులంద‌రి వ‌ద్ద‌కు వెళ్లింది. టూరిస్టులు కూడా భ‌య‌ప‌డ‌కుండా సింహాన్ని ఎంతో ప్రేమ‌గా నెమురుతూ క‌నిపించారు.

oddly terrifying అనే యూజర్ 18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు 'న్యూ వైల్డ్‌ లైఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఇది ఎక్క‌డ జ‌రిగింది అన్న‌ది చెప్ప‌లేదు. ఇక ఈ వీడియోపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story