వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్.. పీట‌ల మీద కూడా ప‌నేనా..?

Kolkata Groom Seen Working On Laptop During Wedding.పెళ్లి పీట‌ల‌పైన కూర్చున పెళ్లి కొడుకు మాత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 12:50 PM IST
వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్.. పీట‌ల మీద కూడా ప‌నేనా..?

క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చాలా మంది జీవితాల్లో భాగ‌మైంది. కొంద‌రు ఈ విధానం బాగుంద‌ని అంటుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం తీవ్ర‌మైన ప‌ని ఒత్తిడి ఉంటోంద‌ని అంటున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఫోటో కార‌ణంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఓ ప‌క్క పెళ్లి భాజాలు మోగుతున్నాయి. మ‌రో ప‌క్క పురోహితుడు వేద మంత్రాలు చ‌దువుతున్నాడు. అయితే.. పెళ్లి పీట‌ల‌పైన కూర్చున పెళ్లి కొడుకు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ల్యాప్‌టాప్‌లో సీరియ‌స్‌గా ఏదో ప‌ని చేసుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో అనేది మాత్రం తెలియ‌రాలేదు. కానీ కోల్‌క‌తా ఇన్‌స్టాగ్రామ‌ర్స్ అనే అకౌంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పాపం పెళ్లి రోజు కూడా ప‌ని చేయాల్సిందేనా అని కొంద‌రు కామెంట్లు పెడుతుండా, మ‌రికొంద‌రు మాత్రం వ్య‌తిరేకంగా స్పందిస్తున్నారు. వివాహం రోజున ప‌ని చేయాల‌ని ఏ సంస్థ కూడా చెప్ప‌దు అని ఆఫీస్ వ‌ర్క్‌ను వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ పెళ్లి కొడుకు నేర్చుకోవాల‌ని అంటున్నారు.

Next Story