భారీ హంగామా లేదు.. బైక్ లో అలా వచ్చేసిన ఎంపీ..!

ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2024 1:45 PM IST
hyderabad, mp asaduddin owaisi, bike, ride,

భారీ హంగామా లేదు.. బైక్ లో అలా వచ్చేసిన ఎంపీ..!

ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది. పలు పార్టీలు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే పెద్ద ఎత్తున జన సమీకరణ.. భారీగా వాహనాలతో సందడి సందడిగా ఉంటుంది. అయితే హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంతో సింపుల్ గా బైక్ లో ప్రచారం చేయాల్సిన ప్రాంతానికి వెళ్లిపోయారు.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బైక్‌పై వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఆయన బైక్ పై వెళ్ళిపోతూ ఉండగా ఆయన మద్దతుదారులు ఆయన్ను ఫాలో అవుతూ ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఐదోసారి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటింటికీ ప్రచారంతో పాటూ బహిరంగ సభలలో ప్రసంగిస్తూ వస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Next Story