ఉద్యోగి చేతి వేళ్లు మిస్సింగ్.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
సూరత్‌కు చెందిన ఓ అకౌంటెంట్ చేతి వేళ్ల మిస్సింగ్ మిస్టరీని గుజరాత్ పోలీసులు ఛేదించారు. మయూర్ తారాపరా అనే వ్యక్తి, అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తన వేళ్లు మిస్ అయ్యాయని మొదట పేర్కొన్నాడు.
By అంజి Published on 15 Dec 2024 9:22 AM IST
ఉద్యోగి చేతి వేళ్లు మిస్సింగ్.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
సూరత్‌కు చెందిన ఓ అకౌంటెంట్ చేతి వేళ్ల మిస్సింగ్ మిస్టరీని గుజరాత్ పోలీసులు ఛేదించారు. మయూర్ తారాపరా అనే వ్యక్తి, అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తన వేళ్లు మిస్ అయ్యాయని మొదట పేర్కొన్నాడు. తరువాత తన బంధువు డైమండ్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగా వాటిని తాను నరికివేసుకున్నట్టు అంగీకరించాడు. డిసెంబరు 8న తారాపరా తన ఎడమ చేతి వేళ్లు కనిపించకుండా పోయాయని పోలీసులను సంప్రదించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అతని ప్రాథమిక ప్రకటన ప్రకారం.. అతను ఆ రాత్రి సూరత్‌లోని వేదాంత్ సర్కిల్ దగ్గర స్నేహితుడి కోసం వేచి ఉన్నాడు. ఒక గంట తర్వాత, అతని స్నేహితుడు కనిపించకపోవడంతో, అతను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దారిలో యూరిన్ రావడంతో అతను కొద్దిసేపు ఆగిపోయాడు. ఆ తర్వాత అతను తల తిరగి మూర్ఛపోయాడు. అతను స్పృహలోకి వచ్చినప్పుడు అతను తన ఎడమ చేతి యొక్క నాలుగు వేళ్లు పోయినట్లు గమనించాడు.
తారాపరా తన స్నేహితుడిని అప్రమత్తం చేశాడు. అతను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అతని తెగిపోయిన వేళ్లకు చికిత్స అందించారు. అదే రోజు అతన్ని డిశ్చార్జ్ చేశారు. పోలీసు పరిశోధనలు ఉన్నప్పటికీ, అతను వివరించిన ప్రదేశంలో రక్తపు జాడలు లేదా ఆధారాలు కనుగొనబడలేదు. అతను చెప్పిన వివరాలు.. అతనిపైనే అనుమానపు ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.
రెండ్రోజుల తర్వాత సూరత్ క్రైమ్ బ్రాంచ్ అసలు విషయాన్ని బయటపెట్టింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ భవేష్ రోజియా మాట్లాడుతూ.. "మయూర్ తారాపరా తన వేళ్లను తానే కత్తిరించుకున్నట్లు అంగీకరించాడు. అతను కత్తిని కొనుగోలు చేసి, ప్రణాళికాబద్ధంగా ఈ చర్యకు పాల్పడ్డాడు". తారాపరా పనిలో విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారని రోజియా తెలిపారు. అతను బంధువు యాజమాన్యంలోని జ్యువెలరీ షోరూమ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. అతనికి ఆ ఉద్యోగం చేయాలని లేకపోయినా.. అతని తండ్రి కారణంగా బలవంతంగా చేస్తున్నట్టు సమాచారం.
తారాపరా మొబైల్ లొకేషన్ డేటా యొక్క విశ్లేషణ, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో కూడిన దర్యాప్తు, అతని ఒప్పుకోలును ధృవీకరించింది. మొదట మూడు వేళ్లను కోసి, తర్వాత నాలుగో వేళ్లను నరికివేసినట్లు తారాపర వెల్లడించారు. మీడియా అతనిని ప్రశ్నించగా.. ‘నేను ఎందుకు అలా చేశానో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించేందుకు తారాపరా నిరాకరించారు.