ఆస్పత్రిలో దెయ్యంతో సెక్యూరిటీ గార్డు ముచ్చట్లు.. వీడియో వైరల్‌

Guard speaks to ‘ghost patient’ in spine-chilling viral video. అర్జెంటీనా దేశంలో జరిగిన ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో గగుర్పాటుకు గురి

By అంజి  Published on  22 Nov 2022 11:36 AM GMT
ఆస్పత్రిలో దెయ్యంతో సెక్యూరిటీ గార్డు ముచ్చట్లు.. వీడియో వైరల్‌

అర్జెంటీనా దేశంలో జరిగిన ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో గగుర్పాటుకు గురి చేయడంతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు కనిపించని వారితో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అర్జెంటీనాలోని ఓ ఆసుపత్రిలో "దెయ్యం రోగితో" సెక్యూరిటీ గార్డు మాట్లాడాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా వింతగా ఉండటంతో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో రెడ్డిట్‌లో షేర్ చేయబడింది మరియు మిలియన్ల మంది వీక్షణలను సంపాదించింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు. అర్జంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోచియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఇది జరిగింది. ఈ ఆస్పత్రిలో రాత్రిపూట ఓ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉన్నాడు. వీడియో ఉన్న దాని ప్రకారం.. సుమారు 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రి మెయిన్‌డోర్‌ ఒక్కసారిగా తెరచుకుంది. అయితే చూడడానికి అక్కడ ఎవరూ లేరు. కానీ సెక్యూరిటీ గార్డుకు మాత్రం అక్కడే ఎవరో ఉన్నట్లు కనిపించినట్టుంది. వెంటనే సెక్యూరిటీ గార్డు తన సీటులో నుంచి లేచి.. నో ఎంట్రీ రోప్‌ తీసి ఆసుపత్రి రిజిస్టర్‌లో ఎవరో పేషెంట్‌ వచ్చినట్లు వివరాలు నమోదు చేశాడు. అలాగే కనిపించని వ్యక్తి(దెయ్యం రోగి)తో మాట్లాడాడు.

ఆ తర్వాత లోపలికి ఎలా వెళ్లాలో వివరించి.. తిరిగి తన సీట్‌లోకి వచ్చి కూర్చుంటాడు. ఇదంతా ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్‌ అయ్యింది. ఇది చూసిన వైద్యులు, ఇతర సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీడియో వైరల్‌ కావడంతో ఆసుపత్రిలోకి 'ఘోస్ట్‌ పేషెంట్‌' వచ్చింది అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నిజంగానే దెయ్యం రోగి వచ్చిందా, లేకా కావాలనే సెక్యూరిటీ గార్డు ఇలా చేశాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే న్యూస్‌మీటర్‌ ఈ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించలేకపోయింది. డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఫుటేజీని తిరిగి చూస్తే ఆ ఆసుపత్రిలో ఒక రోజు ముందు ఓ రోగి మరణించాడు. ఈ వీడియోను చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు భయపడుతుండగా, మరికొందరు కామెంట్స్ విభాగంలో ఇది బహుశా గార్డు బాగా తీసిన చిలిపి పని అని అన్నారు. ''సరే, ఇది చాలా విచిత్రంగా ఉంది. గార్డు కెమెరాలపై జోక్ ఆడుతున్నాడో లేదా దీనిని వివరించడం చాలా కష్టం'' అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Next Story
Share it