ఘోరంగా కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు.. వీడియో వైరల్
Fight Between college girls in a college on Gangapur Road Nashik video goes viral.ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు
By తోట వంశీ కుమార్ Published on
19 Nov 2022 5:11 AM GMT

ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపైనే ఒకరి జట్టు ఇంకొకరు పట్టుకుని కొట్టుకున్నారు. వీరి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కాలేజీలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. క్యాంటీన్‌లో సీట్ల విషయమై ఇద్దరు విద్యార్థినుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మాటల యుద్ధం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి కొట్లాటకు దారి తీసింది. దీంతో అక్కడి క్యాంటీన్ సిబ్బందిని ఇద్దరిని బయటకు పంపించివేశారు. బయటకు వచ్చాక కూడా ఆ ఇద్దరు విద్యార్థినులు గొడవ ఆపలేదు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. జట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. సహచర విద్యార్థినులు వారిని ఆపేందుకు యత్నించినా వారు ఏ మాత్రం తగ్గలేదు.
ఇంకొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోలో జుట్టు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకోవడం కనిపిస్తుంది
Next Story