దానికోసం బస్సును నడి రోడ్డుపైనే ఆపిన డ్రైవర్.. వీడియో వైరల్
Driver stops bus in the middle of the road to take a chai break.ఓ బస్సు డ్రైవర్‌కి ఛాయ్ తాగాలని అనిపించింది.
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 6:46 AM GMTఛాయ్, టీ పేరు ఏదైనా కానివ్వండి. మనదేశంలో చాలా మందికి ఉదయాన్నే ఛాయ్ తాగే అలవాటు ఉంది. ఛాయ్ తాగనిదే ఏ పని చేయరు. కొందరు ఉదయం, సాయంత్రం మాత్రమే తాగితే మరికొందరు రోజుకి నాలుగు లేదా ఆరు సార్లు ఛాయ్ తాగుతుంటారు. అంతలా మనిషి జీవితంలో భాగమైన ఛాయ్ కోసం కొందరు ఏ పనైనా చేస్తారు. వీరు చేసే పనులు కొన్ని సార్లు పక్కవారికి ఇబ్బందులు కలిగిస్తాయి. ఓ బస్ డ్రైవర్ ఛాయ్ కోసం చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ బస్సు డ్రైవర్‌కి ఛాయ్ తాగాలని అనిపించింది. అందులో తప్పేమీ ఉంది అంటారా..? తప్పు ఏమీ లేదు గానీ.. అతడు ఆ సమయంలో బస్సు నడుపుతున్నాడు. రోడ్డుకు అవతలి వైపు ఓ కాఫీ షాప్ కనిపించింది. ఇంకేముంది బస్సును షాప్ ముందే నడి రోడ్డుపై ఆపేశాడు. ఎంచక్కా బస్సు దిగి రోడ్డు దాటి షాపుకు వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన ఛాయ్ తాగడం ప్రారంభించాడు.
men😭☕ pic.twitter.com/EDOSmxlnZC
— Shubh (@kadaipaneeeer) January 2, 2023
అతడు బస్సును నడిరోడ్డుపై ఆపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెనుక ఉన్న వాహనదారులు హారన్లు మోగించడంతో పాటు అరుస్తున్నప్పటికీ నినాదంగా వచ్చి బస్సును తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శుభ్ అనే యూజర్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. 25 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
అంతగా ఛాయ్ తాగాలని అనిపిస్తే రోడ్డు పక్కకు బస్సు ఆపి వెళ్లి తాగొచ్చుగా.. మరీ నడిరోడ్డుపై ఆపి అందరికి ఇబ్బంది పెట్టాలా అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.