ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి హార్ట్‌ ఎటాక్..ప్రాణాలు నిలబెట్టిన లేడీ డాక్టర్ (వీడియో)

హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2024 6:15 AM GMT
delhi airport, man, heart attack, lady doctor, cpr, viral video,

ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి హార్ట్‌ ఎటాక్..ప్రాణాలు నిలబెట్టిన లేడీ డాక్టర్ (వీడియో)

హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వృద్ధులు మాత్రమే కాదు.. యంగ్‌ ఏజ్‌లో ఉన్నవారిలో కూడా ఈ గుండెపోటు వస్తోంది. ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండి జిమ్‌ చేస్తున్నవారు కూడా హార్ట్‌ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే.. హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు పక్కనే ఎవరైనా వైద్య నిపుణులు ఉంటే సీపీఆర్ చేస్తే బతికే అవకాశాలు ఉంటాయి. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధుడు ఉన్నట్లుండి గుండెపోటుకి గురై కిందపడిపోయాడు. సమయానికి అక్కడే ఉన్న ఓ లేడీ డాక్టర్‌ వెంటనే స్పందించింది. వృద్ధుడి ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు రెండో టర్మినల్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఫుడ్‌ కోర్టు ఏరియాలో ఓ 60 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మహిళా డాక్టర్‌ వేగంగా స్పందించింది. గుండెపోటకు గురైనట్లుగా గుర్తించి ప్రథమ చికిత్స అందించింది. వృత్తి ధర్మాన్ని పాటించి ఆయన ఆయువు నిలిపింది. కుప్పకూలిన వృద్ధుడి చాతిపై నొక్కుతూ సీపీఆర్ ఇచ్చింది. ఆమె ప్రయత్నం ఫలితించింది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు. మహిళా డాక్టర్‌ సీపీఆర్ చేస్తుండగా అక్కడే ఉన్న కొందరు దాన్ఇన వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. వైరల్ అవుతోంది. వైద్యురాలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె వివరాలు ఇప్పటికైతే తెలియరాలేదు కానీ.. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు .

Next Story