Viral Video : మొసలికి చిక్కిన‌ తాబేలు.. ఎవ‌రూ ఊహించ‌నిది జ‌రిగింది..!

మొసళ్ళు చాలా ప్రమాదకరమైనవి, ప్రజలు వాటి పేరు వింటేనే భయపడతారు.

By Medi Samrat
Published on : 10 Aug 2024 6:19 PM IST

Viral Video : మొసలికి చిక్కిన‌ తాబేలు.. ఎవ‌రూ ఊహించ‌నిది జ‌రిగింది..!

మొసళ్ళు చాలా ప్రమాదకరమైనవి, ప్రజలు వాటి పేరు వింటేనే భయపడతారు. అందుకే మనిషినా, జంతువైనా మొసలికి చిక్కితే అంతే సంగ‌తులు. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఒక మొసలికి తాబేలు చిక్కింది. అయితే ఈ వీడియోలో మీరు ఊహించనిది జరిగింది.

అంద‌రినీ ఆశ్చర్యపరిచిన ఈ వైరల్ క్లిప్‌లో.. ఆకలితో ఉన్న మొసలి తాబేలును తిన‌డానికి ప్రయత్నిస్తుంది. తాబేలు మొసలి నోటిలో ఇరుక్కుంది. అయితే మొసలికి లొంగిపోకుండా తాబేలు యొక్క మందపాటి షెల్ కవచంగా పనిచేసింది. దీంతో మొసలి నోటి నుండి క్షేమంగా తాబేలు తప్పించుకుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ వీడియోకు నెటిజ‌న్‌లు త‌మ‌దైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

Next Story