న‌డిరోడ్డుపై వికృత చేష్ట‌లు.. బైక్ పై ప్రేమ జంట రొమాన్స్‌.. ఆ త‌రువాత ఏమైందంటే..?

Couple's Public Display Of Emotion On Bike Lands Them In Trouble.ఇటీవ‌ల కాలంలో కొన్ని ప్రేమ జంట‌లు రెచ్చిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2023 8:54 AM IST
న‌డిరోడ్డుపై వికృత చేష్ట‌లు.. బైక్ పై ప్రేమ జంట రొమాన్స్‌.. ఆ త‌రువాత ఏమైందంటే..?

సినిమాల ప్ర‌భావ‌మో మ‌రేమిటో తెలీదు గానీ ఇటీవ‌ల కాలంలో కొన్ని ప్రేమ జంట‌లు రెచ్చిపోతున్నాయి. తాము ప‌బ్లిక్‌లో ఉన్నాము అన్న స్పృహ కూడా వారికి ఉండ‌డం లేదు. న‌డిరోడ్డులో బైక్‌పై అస‌భ్య చేష్ట‌లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. విశాఖ‌ప‌ట్నం, జార్ఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి రాగా.. తాజాగా రాజ‌స్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లోనూ చోటు చేసుకుంది.

అజ్మీర్‌లోని కాలేజ్ క్రాస్ రోడ్-నౌస‌ర్ వ్యాలీ ర‌హ‌దారిపై ఓ ప్రేమ జంట బైక్‌పై వెలుతున్నారు. యువ‌కుడు డ్రైవ్ చేస్తుండ‌గా.. అత‌డి ప్రియురాలు పెట్రోల్ ట్యాంక్‌పై అత‌డికి ఎదురుగా కూర్చొని రొమాన్స్ చేస్తుకుంటున్నారు. అదే ర‌హ‌దారి గుండా వెలుతున్న ప‌లువురు వీరిని చూసి షాకైయ్యారు. వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. సోమ‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ప‌లువురు కోరారు.

ఇక ఈ వీడియో పోలీసుల దృష్టిలో ప‌డ‌డంతో స్పందించారు. వెంట‌నే ఆ జంట‌ను అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్ చేశామ‌ని, చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పోలీసులు ట్వీట్ చేశారు.

Next Story