మద్యం మత్తులో రోడ్డుపై సన్నీ డియోల్.. వైరల్‌ వీడియోపై క్లారిటీ

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ డియోల్‌ మద్యం మత్తులో నడిరోడ్డుపై తిరుగుతున్నట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 5:25 PM IST
bollywood, actor sunny deol, viral video,

మద్యం మత్తులో రోడ్డుపై సన్నీ డియోల్.. వైరల్‌ వీడియోపై క్లారిటీ  

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ డియోల్‌ మద్యం మత్తులో నడిరోడ్డుపై తిరుగుతున్నట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఫుల్లుగా తాగడమే కాకుండా పబ్లిక్‌లో వీరంగం సృష్టిస్తున్నాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఆయనకు ఇదేమీ కొత్త కాదన్నట్లు చెప్తున్నారు. పేరుకే సెలబ్రిటీ అయినా.. చేసే పనులు ఇలా ఉంటాయని విమర్శలు చేస్తున్నారు. సన్నీ డియోల్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తూ తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. ఈ ట్రోలింగ్‌కు చెక్‌ పెడుతూ.. వీడియో వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టాడు సన్నీ డియోల్. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా మరో వీడియోను షేర్ చేశాడు.

అయితే.. ముందు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో మద్యం మత్తులో తులుతూ నడుస్తు ఉంటాడు సన్నీ డియోల్. వాహనాలు చుట్టూ తిరుగుతుంటాయి. నిర్లక్ష్యంగా ఒక ఆటో మీద పడిపోతాడు. తాగేసి ఉన్న సన్నీ డియోల్‌ను ఆటో డ్రైవర్‌ తన వాహనంలో ఎక్కించుకుంటాడు. కాగా.. ఈ వీడియో బాగా ట్రోల్‌ కావడంతో అసలు నిజాన్ని చెప్పాడు సన్నీ డియోల్. మద్యం మత్తులో ఉన్నట్లు సన్నీ డియోల్ నటిస్తూ ఉంటాడు. అక్కడే కెమెరాలు పట్టుకున్న కొందరు.. ట్యాక్సీని ముందుకు రమ్మని చెప్పండి అంటూ చెబుతారు. అప్పుడే ట్యాక్సీ సన్నీ డియోల్‌ దగ్గరగా వస్తుంది. అంటే వైరల్ అయిన వీడియో సినిమా చిత్రీకరణలో భాగమే అని తేలిపోయింది.

ఇప్పటికైనా పుకార్లకు చెక్‌ పడుతుందని ఆశిస్తున్నా అంటూ సన్నీ డియోల్‌ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. దీన్ని చూసిన సన్నీ డియోల్ ఫ్యాన్స్‌.. మిమ్మల్ని ద్వేషించేవాళ్లు కావాలనే వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. వాటిని మీరేమీ పట్టించుకోవద్దు అంటూ సపోర్ట్‌ చేశారు. మీరు డ్రింక్‌ చేయరు అని కొందరు.. చేసినా ఇలా చీప్‌గా బీహేవ్ చేయరని కొందరు రాసుకొచ్చారు. సన్నీ డియోల్ నెక్ట్స్‌ సినిమా కోసం తాము ఎంతో వెయిట్‌ చేస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్‌ చేశారు. సన్నీ ప్రస్తుతం బాప్‌, లాహోర్ 1947, సూర్య సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.


Next Story