దున్నపోతుపై పోలింగ్ సెంటర్‌కు ఓటర్.. ఎందుకంటే..
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 May 2024 11:08 AM GMTదున్నపోతుపై పోలింగ్ సెంటర్‌కు ఓటర్.. ఎందుకంటే..
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఇప్పటికే 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయ్యిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రముఖులు అయితే విదేశాల నుంచి వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు కొత్తగా ఓటర్ లిస్ట్‌లో జాయిన్ అయిన వారు కూడా తొలిసారి తమ ఓటును వేశారు. వీరిలో ఒక వ్యక్తి మాత్రం తన ఫస్ట్ ఓటింగ్‌ను మెమొరబుల్‌గా ఉంచుకోవాలనుకుని వింత పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న ఓ యువకుడు.. తనకు గుర్తుండిపోవాలని వింతగా ప్రవర్తించాడు. ఎన్నికల పోలింగ్ కేంద్రానికి దున్నపోతుపై వచ్చాడు. ఇలా చేయడం ద్వారా ఈ సందర్భం తనకెప్పుడూ గుర్తుంటుందని ఆ యువకుడు చెబుతున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సమస్తిపూర్ జిల్లాలోని ఉజియాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో.. తాను వేసే తొలి ఓటు సందర్భంగా ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అప్పుడే అతనికొక ఆలోచన వచ్చింది. దున్నపోతుపై వెళ్లి ఓట్ వేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నల్ల చొక్కా, గ్రే కలర్ ప్యాంట్ ధరించి.. తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టుకుని దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు. తనకు మాత్రమే కాదు.. దున్నపోతు తలకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు ఆ యువకుడు. దున్నపోతుపై యువకుడు పోలింగ్ కేంద్రానికి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ కేంద్రంలో ఉన్న మిగతా ఓటర్లు యువకుడిని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
#Watch: It Was His First Vote. So He Rode A Buffalo To Polling Station#ElectionsWithNDTV #Bihar pic.twitter.com/w482IhHQpi
— NDTV (@ndtv) May 13, 2024