మూడో ఫ్లోర్ నుంచి జారిపడినా బతికిన చిన్నారి..మహారాష్ట్రలో ఊహించని ఇన్సిడెంట్
By Knakam Karthik
మూడో ఫ్లోర్ నుంచి జారిపడినా బతికిన చిన్నారి..మహారాష్ట్రలో ఊహించని ఇన్సిడెంట్
మహారాష్ట్రలోని థానేలో ఊహించని ఘటన జరిగింది. రెండేళ్ల చిన్నారి మూడంతస్తుల బిల్డింగ్ బాల్కనీ నుంచి జారిపడి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజుల క్రితం డొంబివిలీలో ఓ పదమూడు అంతస్తుల బిల్గింగ్‌లోని మూడో ఫ్లోర్ బాల్కనీలో రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పాప కిందపడుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. చిన్నారి పైనుంచి కింద పడుతున్న సమయంలోనే ఓ వ్యక్తి పరుగెత్తుకెళ్లి చిన్నారిని తన చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కొద్ది సమయంలో ఆ చిన్నారి తన చేతులను తాకి కిందపడిపోయింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాద తీవ్రతను తగ్గించి..రెండేళ్ల చిన్నారిని కాపాడిన వ్యక్తిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాపను సేఫ్‌గా పట్టుకునేందుకు సమయానికి వచ్చిన దేవుడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.