మద్యానికి బానిసైన కోతి.. వైన్‌షాపులోకి దూరి మరీ.. వీడియో వైరల్
A beer-drinking monkey is a menace in UP's Raebareli. మద్యానికి బానిసైన ఓ కోతి రోజూ వైన్ షాపులో దూరి మద్యం సేవిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో
By అంజి Published on
1 Nov 2022 8:50 AM GMT

మద్యానికి బానిసైన ఓ కోతి రోజూ వైన్ షాపులో దూరి మద్యం సేవిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మద్యానికి బానిసైన కోతి మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి హల్‌చల్ చేస్తోంది. కోతి హంగామా వైన్ షాపు నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. అచల్‌గంజ్ ప్రాంతంలోని వైన్ షాపులో సిబ్బంది బీరుకు బానిసైన మంకీతో ఇబ్బందులు పడుతున్నారు.
షాపు నుంచి కొనుగోలు చేసే వారి నుంచి మద్యం బాటిళ్లను కూడా కోతి లాక్కుంటోంది. కోతి బీరు పుచ్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కింగ్‌ఫిషర్ బీరును సేవిస్తున్న కోతిని చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. అటవీ శాఖ సహకారంతో ఈ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. బాటిల్ తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోతి దూకుడుగా మారుతుందని మద్యం దుకాణం యజమాని తెలిపారు.
Next Story