Fact Check : జగిత్యాల జిల్లాలో మనిషి తలతో ఉన్న జంతువు అంటూ ఫోటోలు వైరల్..?

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 14 Sept 2020 1:23 PM IST

Fact Check : జగిత్యాల జిల్లాలో మనిషి తలతో ఉన్న జంతువు అంటూ ఫోటోలు వైరల్..?

కొన్ని కొన్ని సార్లు వింత వింత ముఖాలతో జంతువులు పుడుతూ ఉంటాయి. వాటి గురించి విపరీతమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాటికి కొన్ని మూఢ నమ్మకాలు తోడైతే అంతే సంగతులు. తాజాగా ఓ వింతజీవి గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. నాలుగు కాళ్లతో ఉన్న జంతువు.. దానికి మనిషిని పోలిన ఓ ముఖం కూడా ఉంది. పలువురు దీన్ని తమ తమ అకౌంట్లలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇదేదో ఏలియన్ అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు. పలు భాషల్లో ఈ ఫోటోలను పోస్టు చేస్తూ ఉన్నారు.

ఇంతకూ ఈ జీవి ఏమిటో కాస్త చెప్పరూ అని అడుగుతున్నారు. @Discovery @DiscoveryIN @NatGeo @anandmahindra @aajtak @ABPNews @vivekagnihotri @rahulkanwal @TajinderBagga @theskindoctor13 @Atheist_Krishna @AnimalPlanet @IndiaToday @indiatvnews pic.twitter.com/UNqP8h396P



ఫేస్ బుక్ లో కూడా ఓ వింత జంతువు కనిపించింది. ఇదేమైనా గ్రహాంతర వాసి అయి ఉంటుందా..? అని పోస్టులు చేశారు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసారు.

A1

News18 Telugu వెబ్ సైట్ లో కూడా ఈ జీవి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కనిపించిందని కథనాన్ని ప్రచురించారు. గొల్లపల్లి గ్రామంలో ఈ జీవి కనిపించిందని.. మనిషికి ఉన్నట్లే ముక్కు, నోరు, అన్నీ ఉన్నాయని.. ఒంటి మీద మొసలి తరహాలో ఉందని అందులో తెలిపారు.

A2

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'. అది అసలు జీవీ కాదు..!

ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా "Unbelievable Creepy Hyper Realistic Creatures By Laira Maganuco” అనే బ్లాగులో ఇదే ఫోటోను అప్లోడ్ చేశారు.

'లైరా మగానుకో' అనే ఆర్టిస్ట్ ఇటువంటి తరహాలో పలు బొమ్మలను తయారు చేస్తూ ఉంటుంది. అచ్చం నిజంగానే ఉన్నాయా అన్నట్లుగా ఆమె తయారు చేసిన బొమ్మలు అనిపిస్తూ ఉంటాయి. హైపర్-రియలిజం సిలికాన్ బొమ్మలు ఇవని ఆమె చెబుతూ ఉంటారు. చాలా పరిశోధనలు చేశానని.. సిలికాన్ మెటీరియల్ ను ఉపయోగించి తాను ఈ బొమ్మలు తయారు చేశానని ఆమె తెలిపింది. చూడడానికి కూడా నిజమైన వాటిలా అనిపించడమే కాకుండా.. ముట్టుకున్నా కూడా అచ్చం జీవం ఉన్న బొమ్మలాగే అనిపిస్తూ ఉందని ఆమె చెబుతోంది. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది సిలికాన్ బొమ్మనే..!

8,088.64 డాలర్లకు ఆ బొమ్మను అమ్మకానికి పెట్టారు. ఆర్మడిల్లో అనే పేరును దీనికి పెట్టారు. న్యూస్ మీటర్ 'లైరా మగానుకో' అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ ఫోటోను పోస్టు చేశారు. ఆమె జులై 2019 లో ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసింది.

View this post on Instagram

armadillo hybrid

A post shared by Laira Maganuco (@lairamaganuco) on

ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆర్మడిల్లో హైబ్రిడ్ అంటూ ఆ బొమ్మ గురించి వివరించింది. ‘A single-piece silicone Armadillo hybrid’ అంటూ వివరించింది.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నది ఓ సిలికాన్ బొమ్మ మాత్రమే.. అంతేకానీ ఇదేమీ గ్రహాంతరవాసి కాదు..! వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Next Story