Fact Check : బిన్ లాడెన్ కుమార్తె భోజ్‌పురి సింగర్ ను పెళ్లి చేసుకుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sept 2020 5:26 PM IST
Fact Check : బిన్ లాడెన్ కుమార్తె భోజ్‌పురి సింగర్ ను పెళ్లి చేసుకుందా..?

బిన్ లాడెన్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతాయి. అతడు చేసిన మారణహోమాలు అలాంటివి. తాజాగా ఒసామా బిన్ లాడెన్ కుమార్తెకు సంబంధించిన పోస్టు వైరల్ అవుతోంది. ఒసామా కుమార్తె జోయా భోజ్ పూరి సింగర్ ప్రదీప్ మౌర్యను పెళ్లి చేసుకుందంటూ పోస్టు పెట్టారు.

ఓ మహిళ, ఓ వ్యక్తి ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ కుమార్తె హిందూ ధర్మాన్ని స్వీకరించిందని.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెట్టారు.



ओसामा बिन लादेन की बेटी ने #हिंदू #धर्म🚩 अपनाया और कहा कि दुनिया का सबसे बेकार व गंदा धर्म इस्लाम है उसने आर्य समाज मे हिन्दू लड़के से शादी की उसने इस्लाम धर्म की सारी लड़कियों से कहा कि वे अपने भविष्य और सम्मान को सुरक्षित रखने के लिए हिन्दू धर्म ही एक मात्र विकल्प है అంటూ హిందీలో పోస్టును పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ పేరు పాకిస్థాన్ యాక్ట్రెస్, మోడల్ అయిన సైరా యూసుఫ్.. ఆమెకు ఒసామా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఒసామా బిన్ లాడెన్ కు జోయా అనే పేరు గల కుమార్తె లేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

వైరల్ అవుతున్న పోస్టును రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Film City Gorakhpur అనే బ్లాగులో ఆ ఫోటో ఉండడాన్ని గమనించవచ్చు. భోజ్ పూరి సింగర్, నటుడు అయిన ప్రదీప్ మౌర్య ఫోటోను మీరు చూడొచ్చు.

ఆ వైరల్ పోస్టులో ఉన్న అమ్మాయి ఫోటో పాకిస్థానీ నటి, మోడల్ అయిన సైరా యూసుఫ్. ఆమెకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. పాకిస్థానీ బ్లాగ్ లో మిర్రర్ ఇమేజ్ ను కూడా ఉంచారు. సైరా షబ్రోజ్ సబ్వారీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది మే నెలలో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.

View this post on Instagram

A post shared by Syra Yousuf (@sairoz) on

పాకిస్థాన్ న్యూస్ మీడియా కూడా సైరాకు.. ఒసామా బిన్ లాడెన్ కు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది.

ఒసామా బిన్ లాడెన్ కు జోయా అనే కుమార్తె ఉందంటూ ఏ మీడియా సంస్థ కూడా చెప్పలేదు. ఈ వైరల్ పోస్టులో ఒసామా కుమార్తె అంటూ వైరల్ అవుతున్న పోస్టు పాకిస్థాన్ నాటికీ చెందినది. భోజ్ పురి సింగర్ ప్రదీప్ మౌర్య జోయాను పెళ్లి చేసుకోలేదు. ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు.

వైరల్ పోస్టు 'పచ్చి అబద్ధం'.

Next Story