విద్యుత్‌ అధికారులను కట్టేశారు.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 7:31 PM IST
విద్యుత్‌ అధికారులను కట్టేశారు.. ఎందుకంటే..?

మెదక్‌ జిల్లా జనం తిరగబడ్డారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించలేదని.. విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అదికారులను నిర్భంధించారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం ముస్తాపూర్‌ గ్రామంలో జరిగింది.

శనివారం మెదక్‌ జిల్లా అల్లదుర్గ మండల పరిధిలోని ముస్లాపూర్‌ గ్రామానికి కొంత మంది విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు వచ్చారు. గ్రామంలోని విద్యుత్‌ సమస్యలను పరిష్కరించకుండా ఊళ్లోకి ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. అక్కడితో ఆగకుండా వచ్చిన అధికారులను గ్రామ మధ్యలోకి తీసుకెళ్లి.. అక్కడే ఉన్న ఓ కరెంట్ పిల్లర్‌కు తాడుతో కట్టేశారు. గ్రామంలోని విద్యుత్ సమస్యల గురించి, బిల్లుల సమస్యల గురించి ఆయా అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు వారిని విడిచి పెట్టమని తీర్మానం చేశారు.

రోజులకు రోజులు విద్యుత్‌లో అంతారాయం కలిగి చీకటిలో గ్రామం మగ్గిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, విద్యుత్ ను వాడకపోయినా అధిక కరెంటు బిల్లులు రావడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న, అధిక బిల్లులు వసూలు చేయడం వంటి విద్యుత్‌‌ సమస్యలను చెప్పటినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story