చంద్రయాన్‌-2 విఫలమైందనే చెప్పాలి. ‘విక్రమ్‌’ల్యాండర్‌, ప్రజ్ఞాన్ రోవర్‌లు పని చేసే అవకాశం ఇక లేనట్లే..! చంద్రుడిపై రాత్రి సమయం ప్రారంభమైంది. దీంతో ‘విక్రమ్‌’తో సంబంధాలు ఏర్పరచుకోవాలన్న ఇస్రో ప్రయత్నాలు ఇక దాదాపుగా సన్నగిల్లినట్లే. చంద్రుడిపై రాత్రి సమయంలో మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. ఇది ‘విక్రమ్‌’ పని చేయడానికి పూర్తి ప్రతికూల వాతావరణం. చంద్రుడిపై రాత్రి వేళల్లో ‘విక్రమ్‌’ పని చేసే విధంగా డిజైన్‌ చేయలేదు. చంద్రుడిపై రాత్రి అంటే ఎర్త్‌పై 14 రోజులకు సమానం. చంద్రుడిపై పగలు కూడా 14 రోజులు ఉంటుంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభమైన మరుక్షణమే ‘విక్రమ్‌’ పని చేయడం ఆగిపోతుంది. చంద్రుడిపై ‘విక్రమ్ ‘ హార్డ్ ల్యాండ్ అయిందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. సోలార్ ప్యానళ్లు రాత్రి సమయంలో పని చేయవు. సో..ఒక వేళ ఇస్రోకు ఏమైనా ఆశలు ఉండి ట్రై చేయాలి అనుకుంటే మళ్లీ 14 రోజులు ఆగాల్సి ఉంటుంది. అయితే.. చంద్రుడిపై రాత్రి సమయంలో మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉండటంతో..పరికరాలు 14 రోజులు తరువాత ఎలా ఉంటాయే అనేది పెద్ద ప్రశ్న.

Image result for vikram lander images

ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతూ..2.1 కి.మీ దూరంలో విక్రమ్ ల్యాండర్‌ కమ్యూనికేషన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో..ఇస్రోతో పాటు భారతీయులు అందరూ నిరాశకు గురయ్యారు. అయితే..విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రో, నాసా తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే..వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వార్త రాస్తున్న సమయానికే చంద్రుడిపై రాత్రి బిగెన్ అయి ఉంటుంది. సో…విక్రమ్‌తో సంబంధాలు కష్టమేనని నిపుణులు అంటున్నారు.

Image result for vikram lander images

చంద్రుడిపై ఊహించని విధంగా వాతావరణం మారిపోతుంటుంది. ముఖ్యంగా దక్షిణ ధృవంపై ఇంకా వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయలేం. చంద్రుడిపై పగటి వేళ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు ఉంటే..రాత్రి వేళ 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. సో..విక్రమ్‌లో ఉన్న రోవర్ ఇంతటి చలిని తట్టుకోలేదు. సో..మళ్లీ 14 రోజులు తరువాత ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ కోసం సెర్చ్‌ చేస్తుంది. అప్పటికి కూడా ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా తక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు.

Image result for vikram lander images

చంద్రయాన్‌-2 విఫలమైనప్పటికీ మన శాస్త్రవేత్తలు సాధించింది తక్కవేం కాదు. కేవలం వెయ్యి కోట్ల రూపాయాలతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇది హాలీవుడ్ సినిమా కంటేతక్కువ ఖర్చు. ప్రధాని మోదీ చెప్పినట్లు ..”సైన్స్‌లో ప్రయోగాలే ఉంటాయి కాని..వైఫల్యాలు ఉండవు”. ఈ మాట స్ఫూర్తితో ఇస్రో శాస్త్రవేత్తలు మరింత పట్టుదలగా ముందుకు వెళ్తారని ఆశిద్దాం. మరో చంద్రయాన్‌ ప్రయోగంతో జాబిలమ్మను ముద్దాడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఇస్రో.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.