కరోనాకు వ్యాక్సిన్ లేదు..మెడికేషన్ ఉంది
By రాణి
- కోలుకున్న విజయవాడ మొదటి కరోనా బాధితుడు
- ఎవరూ అధైర్య పడొద్దు..
కరోనా..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అతి సూక్ష్మజీవి. కరోనా వస్తే చనిపోతారన్న అపోహను వీడాలంటున్నాడు విజయవాడ మొదటి కరోనా బాధితుడు మహేష్ (పేరు మార్చబడింది). ఇటీవలే కోలుకున్న అతను..ఆస్పత్రిలో తనకు వైద్యులిచ్చిన చికిత్స గురించి మీడియాతో పంచుకున్నాడు. ఎవరికైనా హై ఫీవర్ వచ్చినపుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించాడు. కరోనాకు వ్యాక్సిన్ లేదు కానీ..మెడికేషన్ ఉందని, దాని ద్వారానే తాను ఇంత త్వరగా వైరస్ నుంచి కోలుకున్నానని చెప్పాడు. ఆస్పత్రిలో ఒక కరోనా పేషెంట్ ను చూసుకోవడానికి డాక్టర్ తో కలిపి 4-5 మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నాడు. ఈ లెక్క ప్రకారం 3000 మంది కరోనా బాధితులకు 15000 మంది సిబ్బంది అవసరమవుతారని తెలిపాడు. కరోనా గురించి భయపడాల్సిందేమీ లేదని, మనలో రోగనిరోధక శక్తి, మన విల్ పవరే కాపాడుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read : రూ.7.5 కోట్ల విరాళం ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
ప్రభుత్వం చెప్పినట్లు లాక్ డౌన్ పూర్తయ్యేంతవరకూ ఎవరూ బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ సమయాన్నంతా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని కోరాడు. అనవసరంగా బయటికి వచ్చి కరోనా సమూహ వ్యాప్తికి ఎవరూ కారణం కావొద్దని సూచించాడు. కరోనా వైరస్ రావడం ఎవరి తప్పు కాదు కానీ..వైరస్ లక్షణాలున్నా ఆస్పత్రికి రాకపోవడం మాత్రం ముమ్మాటికీ తప్పేనన్నాడు మహేష్. లక్షణాలున్న వారు తమకుతాముగా ట్రీట్మెంట్ తీసుకుంటే సమాజానికి మేలు చేసినవారవుతారని చెప్పాడు.
Also Read :మురికివాడకు భోజనం పంపుతున్న రకుల్