లాక్ డౌన్ అయినప్పటి నుంచి ఎంతోమంది దినసరి కూలీలు, యాచకులు, మురికివాడల్లో బ్రతికేవారికి తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితి. 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్ని రకాల ఆహార ధాన్యాలకు రెక్కలొచ్చాయి. దీంతో సాటి మధ్యతరగతి కుటుంబాల పోషణే కష్టంగా ఉంటే..ఆ రోజు పనిచేసి జీతం తీసుకుంటేగానీ కుటుంబాన్ని పోషించుకోలేని వారి సంగతి ఎలా ఉంటుందో కదా..ఇప్పటి వరకూ టాలీవుడ్ లో అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సహాయం చేశారు..కథానాయికలు మాత్రం ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదన్న విమర్శలొస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేలా ఇప్పుడొక విషయం తెలిసింది.

Also Read : రూ.7.5 కోట్ల విరాళం ప్రకటించిన నెట్ ఫ్లిక్స్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గుడ్ గావ్ లోని తన ఇంటికి సమీపంలో ఉన్న మురికివాడలో ఉన్న 250 కుటుంబాలకు శనివారం నుంచి రెండు పూటలా భోజనం పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ వెబ్ సైట్ తో పంచుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసేంతవరకూ ఇలాగే ఆ కుటుంబాలకు భోజనాన్ని పంపుతానని చెప్పింది. రకుల్ లా అడిగితే గానీ తాము చేస్తున్న సహాయం గురించి చెప్పని హీరోయిన్లు కూడా ఉండే ఉంటారు. వారు కూడా ఏదొక సందర్భంలో ఇలాంటి విషయాలను బయటపెడతారు.

Also Read : కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.