విజ‌య‌వాడ‌ను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే : మల్లాది విష్ణు

టీడీపీ విధానాలు శాసనసభలో, నగరపాలిక సంస్థ కౌన్సిల్లో ఓకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

By Medi Samrat  Published on  17 Feb 2024 8:53 AM GMT
విజ‌య‌వాడ‌ను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే : మల్లాది విష్ణు

టీడీపీ విధానాలు శాసనసభలో, నగరపాలిక సంస్థ కౌన్సిల్లో ఓకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నేడు వార్షిక బడ్జెట్ ను మేయర్ అధ్యక్షతన ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో మూడు నాలుగు కౌన్సిల్స్ లో మిగులు బడ్జెట్ తో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేవలం వైసీపీ మాత్రమేన‌న్నారు. హెల్త్, వెల్త్ కోసం 200 కోట్ల కి పైగా ఖర్చు పెడుతున్నామ‌ని తెలిపారు. టీడీపీ హయంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందన్నారు. నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేన‌న్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నుండి నిధులు తీసుకుని వచ్చామని పేర్కొన్నారు. నగర ప్రజలకు సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగుపరిచామన్నారు. మోసం, ధ‌గా, నిర్లక్ష్యం గత ప్రభుత్వ సిద్దాంతాలన్నారు. గడప గడపకు ద్వారా 96 సచివాలయాల్లో 20 కోట్ల మేర పనులు చేసామని వెల్ల‌డించారు. మంచి నీటి సదుపాయం మెరుగుపడిందన్నారు. మెరుగైన పరిపాలన చేసింది వైసీపీ మాత్ర‌మేన‌న్నారు. జవాబుదారీతనంగా పని చేస్తున్నామ‌ని తెలిపారు. 20 వేల మందికి ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ కు శ్రీకారం చుట్టాము.. ఇవన్నీ గత ప్రభుత్వం లో ఎందుకు చేయలేకపోయారని ప్ర‌శ్నించారు. టీడీపీ సిద్దాంతం రభస చేయటం.. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేటర్ల తీరు ను ఖండిస్తున్-నామ‌న్నారు. నగరపాలక సంస్థ మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు.

Next Story