రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Tomorrow in Vijayawada Traffic restrictions Due to republic day celebration.గణతంత్ర వేడుకలకు విజయవాడలోని
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 4:57 AM GMTగణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ వేడుకలు దృష్ట్యా నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు మళ్లిస్తున్నట్లు పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
ఆంక్షలు ఇలా..
- బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా బస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు వీఐపీల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
- రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ కూడలి, శిఖామణి కూడలి నుంచి వెటర్నరీ కూడలి వైపు ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదు.
- పాత కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్, కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయా టాకీస్, చుట్టుగుంట, పడవల రేవు, రామవరప్పాడు మీదుగా మళ్లిస్తారు. అటు ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, కృష్ణలంక హైవే స్క్రూ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తారు.
ఆంక్షలు గమనించి వాహనదారులు సహకరించాలని పోలీసు కమిషనర్ తెలిపారు.