ఇడుపులపాయ‌లో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం : ప‌వ‌న్‌

Pawan Kalyan visited Ippatam.ఉద్రిక్త‌త‌ల న‌డుమ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టం గ్రామానికి చేరుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 11:16 AM IST
ఇడుపులపాయ‌లో మీ ఇళ్ల  మీదుగా హైవే వేస్తాం : ప‌వ‌న్‌

ఉద్రిక్త‌త‌ల న‌డుమ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఇప్ప‌టం గ్రామానికి చేరుకున్నారు. పర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకునేందుకు య‌త్నించ‌గా ప‌వ‌న్ మండిప‌డ్డారు. ప‌వ‌న్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్నిపోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న కారు దిగి కాలిన‌డ‌క‌న ముందుకు సాగారు. జాతీయ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావ‌డంతో పోలీసులు కాస్త వెన‌క్కి త‌గ్గ‌డంతో త‌న వాహ‌నంలో ప‌వ‌న్ ఇప్ప‌టం గ్రామానికి చేరుకున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూలుస్తున్నారని జనసేన ఆరోపణ చేస్తోంది. ఈ క్ర‌మంలో నేడు అక్క‌డికి వెళ్లిన ప‌వ‌న్ బాధితుల‌తో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మా స‌భ‌కు ఇప్ప‌టం గ్రామ‌స్తులు స్థ‌లం ఇచ్చార‌నే కుట్ర చేస్తున్నారు."పెద‌కాకానిలో ఎమ్మెల్యే ఆర్కే ఇంటి ద‌గ్గ‌ర ర‌హ‌దారి విస్త‌ర‌ణ లేదా..? వైసీపీ వాళ్ల‌ను ఇదే చెబుతున్నా.. ఇడుప‌ల‌పాయ‌లో హైవే వేస్తాం. గుంత‌లు పూడ్చ‌లేరు... రోడ్లు వేయ‌లేరు.. విస్త‌ర‌ణ కావాలా..? ఈ ప్ర‌భుత్వానికి బుద్ధి ఉందా..మేమేమ‌న్నా గుండాల‌మా..? మాట్లాడనీయ‌కుండా ఆప‌డానికి మీరేవ‌రు..? కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు." అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు.

పోలీసులు ఎన్ని అడ్డుకుంలు సృష్టించినా అడ్డుకున్నా మౌనంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. పోలీసులు కూడా తమ సోదరులే వారి కష్టాలు తమకు తెలుసన్నారు.

Next Story