మానవత్వాన్ని చాటుకున్న ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని
Minister Vidadala Rajini helps Road Accident Victims.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తన ఔదార్యాన్ని
By తోట వంశీ కుమార్ Published on
19 May 2022 8:08 AM GMT

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఓ ట్రావెల్ బస్సు.. ద్విచక్రవాహనాన్నిఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇక అదే సమయంలో ఓ రివ్యూ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు అదే మార్గంలో మంత్రి విడదల రజిని వెలుతున్నారు. ప్రమాద ఘటన చూసి చలించిపోయారు. అంబులెన్స్ అక్కడకు చేరుకునే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందితో క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు.
Next Story