మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

Kanakadurga Mata in Mahishasuramardini Alankaram.దుర్గమ్మ చెంత శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 8:15 AM GMT
మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ చెంత శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా తొమ్మిదోరోజున మంగ‌ళ‌వారం మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చారు. దీంతో క్యూ లైన్లు అన్ని భ‌క్తుల‌తో నిండిపోయాయి.

ఈ అలంకారంలో అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల స‌ర్వ‌దోషాలు తొల‌గిపోతాయ‌ని, స్వాతిక భావం ఉద‌యిస్తుంద‌నేది భ‌క్తుల న‌మ్మ‌కం. మ‌హిషాసుర‌మ‌ర్ధిని అష్ట‌భుజాల‌తో అవ‌త‌రించి సింహ‌వాహినియై, లోక‌కంఠ‌కుడైన మ‌హిషాసురుడిని సంహ‌రించి దేవ‌త‌లు, రుషులు, మాన‌వుల క‌ష్టాల‌ను తొల‌గించింది.

ఇక ఉత్స‌వాల్లో ప‌దో రోజైన రేపు( బుధ‌వారం) రాజ‌రాజేశ్వ‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. బుధ‌వారంతో ఇంద్ర‌కీలాద్రిపై ఉత్స‌వాలు ముగియ‌నున్నాయి.

తెప్పోత్స‌వం ర‌ద్దు

కృష్ణా న‌దికి వ‌ర‌ద‌నీరు ఎక్కువ‌గా వ‌స్తున్నందున దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి వార్ల‌కు నిర్వ‌హించాల్సిన తెప్పోత్స‌వాన్ని అధికారులు ర‌ద్దు చేశారు. దుర్గాఘాట్ వ‌ద్ద హంస వాహ‌నంపై పూజ‌ల నిర్వ‌హ‌ణ‌కే అనుమ‌తించిన‌ట్లు తెలిపారు. మ‌రో మూడు రోజుల పాటు వ‌ర‌ద ఉద్దృతి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Next Story
Share it