ఏపీ రాజధానిపై హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన అమృతభారతి పుస్తకా విష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తరువాత తెలుగు వారి పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు.
గొప్పగా చెప్పుకోవచ్చుగాని.. ఏం సాధించామని పునరాలోచన చేసుకోవాలన్నారు. "రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా..? ఢిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని మీ రాజధాని ఏదని" ఆటపట్టి స్తున్నారని తెలిపారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉందని ఆవేదన చెందారు. ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. ఇలాంటి అవలక్ష ణాలు మార్చాల్సిన బాధ్యత రచయితలదేనని తెలిపారు. రచయితలు సామాన్యులను చైతన్యపరిచే గొప్ప మేథాశక్తి కలిగినవారని అభివర్ణించారు. పుస్తకావిష్కరణలో మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.