దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. విజయవాడలోని లయోల కళాశాలలో హిజాబ్ వివాదం చెలరేగింది. హిజాబ్ వేసుకుని కళాశాలకు వస్తే లోనికి రానివ్వడం లేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము మొదటి సంవత్సరం నుంచి ఇలాగే కాలేజీకి వస్తున్నామని.. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించారు. కళాశాల ఐడీ కార్డు చూపించినా నమ్మడం లేదని.. ఐడీ కార్డులోనూ తాము హిజాబ్‌తోనే ఫోటో దిగామని చెబుతున్నారు.
రోజు మాదిరిగానే గురువారం ఇద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు కాలేజీకి వచ్చారు. అయితే సెక్యూరిటీ.. గేటు వద్ద వారిని ఆపారు. తాము మొదటి సంవత్సరం నుంచి ఇలాగే కాలేజీకి వస్తున్నామని.. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం వారు తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయగా.. వారు మతపెద్దలతో పాటు కళాశాల వద్దకు చేరుకున్నారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ఈలోపు పోలీసులుకు కూడా కాలేజీకి చేరుకున్నారు. ప్రిన్సిపాల్‌తో తల్లిదండ్రులు, పోలీసులు మాట్లాడిన తరువాత విద్యార్థినులను హిజాబ్‌తోనే తరగతి గదుల్లోకి అనుమతించారు.