విజ‌య‌వాడ‌లో విషాదం.. బాణసంచా దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Fire Accident in cracker shop in Vijayawada two dead.విజ‌య‌వాడ న‌గ‌రంలో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 4:57 AM GMT
విజ‌య‌వాడ‌లో విషాదం.. బాణసంచా దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

విజ‌య‌వాడ న‌గ‌రంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళిని పురస్కరించకొని న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్‌లోని జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణ‌సంచా స్టాల్‌లో ఆదివారం అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. తొలుత మూడు స్టాల్స్‌లో మంట‌లు చెల‌రేగి పూర్తిగా ద‌గ్థం కాగా.. ప‌క్క‌నే ఉన్న స్టాల్స్‌కు కూడా మంట‌లు వ్యాపించాయి. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 18 ట‌పాసుల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వారిని దుకాణాంలో ప‌ని చేసే వారిగా గుర్తించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 4 ఫైరింజ‌న్లు మంట‌ల‌ను ఆర్పుతున్నాయి. భారీగా శ‌బ్ధాలు రావ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప‌టాకులు కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన‌ వినియోగదారులతో పాటు అక్కడే ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

Next Story
Share it