ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై సీఎం జగన్ కీలక ప్రకటన
CM Jagan good news to AP Govt employees.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on
3 Dec 2021 7:29 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. కాగా.. పీఆర్సీ ప్రకటనపై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. మరో 10 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను తిరుపతిలోని సరస్వతీనగర్‌లో ఉద్యోగుల తరుపున కొందరు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. పీఆర్సీ ప్రక్రియ పూర్తి అయ్యిందని మరో 10 రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన సీఎం జగన్.. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలు, పశువులను కోల్పోయిన రైతులతో సీఎం మాట్లాడారు. తాను అండగా ఉంటానని, అందరూ ధైర్యంగా ఉండాలని వరద బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం జగన్ తిలకించారు.
Next Story