ముఖ్య‌మంత్రి జగన్‌ను కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి

Chinna Jeeyar Swami met CM Jagan Today.తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో సీఎం జ‌గ‌న్ ను త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 11:26 AM IST
ముఖ్య‌మంత్రి జగన్‌ను కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి

తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో సీఎం జ‌గ‌న్ ను త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రామానుజాచార్యులు అవ‌త‌రించి వెయ్యి ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ‌ర‌కు సహస్రాబ్ది మహోత్సవాలను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సహస్రాబ్ది మహోత్సవాలకు రావాల‌ని సీఎం జ‌గ‌న్‌ను త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం జ‌గ‌న్‌.


సీఎంను క‌లిసిన వారిలో చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ‌ర‌కు సహస్రాబ్ది మహోత్సవాలు కొన‌సాగ‌నున్నాయి. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి.



Next Story