దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న జేపీ న‌డ్డా

BJP Chief JP Nadda Visits Vijayawada Kanaka Durga Temple

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2022 8:29 AM GMT
దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న జేపీ న‌డ్డా

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా మంగ‌ళ‌వారం ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. అంత‌క‌ముందు ఆల‌య ఈవో భ్ర‌మ‌రాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత‌రం జేపీ న‌డ్డా అంత‌రాల‌యం నుంచి దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం వేద‌పండితులు ఆశీర్వ‌చ‌నం చేశారు. ఆ త‌రువాత అమ్మ‌వారి ప్ర‌సాదం, చిత్ర‌ప‌టాన్ని ఆయ‌న‌కు అంద‌జేశారు.

ఇక ద‌ర్శ‌నం అనంత‌రం న‌డ్డా మాట్లాడుతూ.. తాను ఎప్ప‌టి నుంచో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి రావాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికి అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అమ్మవారి మహిమ గురించి స్థానిక నాయకులు చెప్పారన్నారు. అమ్మవారి కృప, కరుణ, కటాక్షం ఉండాలని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి అశీర్వాదంతో మంచి పరిపాలన అందాలని జేపీ నడ్డా అన్నారు.

Next Story
Share it