విజయవాడలో కలకలం రేపుతున్న గే డేటింగ్‌ యాప్‌

మన చేతిలో ఉన్న ఫోన్ లో ఎన్నో రకాల డేటింగ్‌ యాప్‌లను మనం చూస్తూ ఉంటాం. మనసుకు నచ్చిన వాళ్లకు వెతుక్కోవచ్చంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2023 1:59 PM IST
gay dating app, Vijayawada, APnews

విజయవాడలో కలకలం రేపుతున్న గే డేటింగ్‌ యాప్‌

మన చేతిలో ఉన్న ఫోన్ లో ఎన్నో రకాల డేటింగ్‌ యాప్‌లను మనం చూస్తూ ఉంటాం. మనసుకు నచ్చిన వాళ్లకు వెతుక్కోవచ్చంటూ ఆ యాప్స్ చెబుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ యాప్స్ కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఒకప్పుడు విదేశాల్లో డేటింగ్ యాప్స్ కు విపరీతమైన స్పందన వస్తూ ఉండేది. ఇప్పుడు మన దేశంలో కూడా డేటింగ్ యాప్ లను బాగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు గే డేటింగ్‌ యాప్‌ వ్యవహారం విజయవాడలో కలకలం రేపుతోంది. గే డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు ఏకాంతంగా కలిశారు. అయితే ప్రసాద్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రిపోర్టులో తీవ్రంగా కొట్టడం వల్లే ప్రసాద్ చనిపోయాడని తేలడంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

విజయవాడకు చెందిన ప్రసాద్, అవనిగడ్డకు చెందిన సాయికి గ్రిండర్ అనే డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. గత నెల 18న విజయవాడలో సాయి, ప్రసాద్ కలుసుకున్నారు. మద్యం తాగి కృష్ణా నదిలోకి ఏకాంతంగా గడపటానికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ప్రసాద్ పై కర్రతో దాడి చేశాడు సాయి. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఆటోలో బయల్దేరి వెళ్లిన ప్రసాద్ మృతిచెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టు మార్టం రిపోర్టులో తీవ్రంగా కొట్టడం వల్ల ప్రసాద్ చనిపోయాడని గుర్తించారు. సాయిని అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో వారి మధ్య జరిగిన మొత్తం వ్యవహారాన్ని కక్కేశాడు.

Next Story