విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఓ బైక్‌ షోరూమ్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

By అంజి  Published on  24 Aug 2023 12:00 PM IST
300 two wheelers gutted, fire, Vijayawada

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఓ బైక్‌ షోరూమ్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన కెపి నగర్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున టీవీఎస్ షోరూమ్, గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోరూమ్ మొదటి అంతస్తు నుంచి మంటలు చెలరేగాయని, వెంటనే పక్కనే ఉన్న గోడౌన్‌కు మంటలు వ్యాపించాయని తెలిపారు. భద్రతా సిబ్బంది అగ్నిమాపక సేవలకు సమాచారం అందించడంతో కనీసం ఐదు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

బైక్‌లకు మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. గోడౌన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా నిల్వ ఉండడంతో మంటలు మరింత వ్యాపించాయి. షోరూం, గోడౌన్, సర్వీస్ సెంటర్ ఒకే చోట ఉండడంతో ద్విచక్ర వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కేంద్రంగా ఉండేది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఛార్జ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షోరూం యజమానికి రూ.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా

Next Story