నూత‌న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

11 YCP MLCs takeoath in legislative council office.స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవ‌మైన 11 మంది వైసీపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 3:34 PM IST
నూత‌న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవ‌మైన 11 మంది వైసీపీ స‌భ్యులు ఎమ్మెల్సీలుగా బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మండ‌లి చైర్మ‌న్ కార్యాల‌యంలో చైర్మ‌న్ మోషేన్‌రాజు నూత‌న ఎమ్మెల్సీల‌తో ప్ర‌మాణం చేయించారు. ఈ కార్యక్ర‌మంలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, వంశీకృష్ణయాదవ్‌, తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్‌, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు నుంచి భరత్‌, అనంతపురం వై.శివరామిరెడ్డి లు శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.

8 జిల్లాల నుంచి 11 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జ‌రుగ‌గా.. వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం అయ్యారు.

Next Story