72 గంట‌ల త‌ర్వాత స్పందించ‌డం విడ్డూరంగా ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Dec 2019 9:16 AM GMT
72 గంట‌ల త‌ర్వాత స్పందించ‌డం విడ్డూరంగా ఉంది

హైదరాబాద్ దిశ ఘటనపై ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే.. సీఎం కేసీఆర్ 72 గంటల త‌ర్వాత స్పందించ‌డం విడ్డురంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చై విజయశాంతి అన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. ఆడపిల్ల మరణంపై స్పందించడానికి మూడు రోజులు పడుతుందా? అని ప్ర‌శ్నించారు. జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో చేతులు దులుపుకొన్నారని ఎద్దేవా చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెప్పలేదని అన్నారు.

ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పిన సీఎం.. హైకోర్టు తీర్పు వచ్చిన్నప్పుడు ఆ ప‌ని ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. ఆర్టీసీని కాపాడే నాధుడే లేడు అన్న కేసీఆర్... ఆర్టీసీని కాపాడేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ.. తెలంగాణ సమాజానికి ఇవ్వడం లేదని ద్వ‌జ‌మెత్తారు.

Next Story
Share it