కడప జిల్లాలో అబ్దుల్లాపూర్‌ ఘటన మరువక ముందే మరో ఊదాంతం చోటు చేసుకుంది. కొండాపురంలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది.

తహశీల్దార్‌ వేధింపులు తాళలేక రైతు ఆదినారాయణ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఆదినారాయణ నిప్పంటించకునే క్రమంలో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ముంపు గ్రామమైన దత్తాపురంకు చెందిన రైతు ఆదినారాయణగా పోలీసులు గుర్తించారు.

తన తల్లి పేరు మీద ఉన్న డికెటి భూమిని తన పేరిట మార్చి నష్ట పరిహారం చెల్లించాలని రెవెన్యూ సిబ్బందిని రైతు ఆదినారాయణ కోరాడు.

కాగా సంవత్సరం కాలంగా వేడుకున్న రెవెన్యూ సిబ్బంది పెడచెవిన పెట్టారని రైతు ఆరోపించాడు. దీంతో మనస్తాపం చెందిన రైతు ఆదినారాయణ ఆత్మహత్యకు యత్నించాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.