కేసీఆర్‌పై విజయశాంతి మళ్లీ విమర్శల వర్షం
By సుభాష్ Published on 15 April 2020 7:30 AM ISTతెలంగాణ రాములమ్మ, నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపించడం మొదలు పెట్టింది. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ 2016 ఏప్రిల్ 14న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆమె ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయింది. దళితులకు 3 ఎకరాల భూమి రాకుండా పోతోంది. దళిత ఉప ముఖ్యమంత్రులు కూడా ఏమయ్యారో అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తున్నది అంటూ ఆరోపణలు గుప్పించారు.
ఎప్పుడో 2016లో చెప్పి కేసీఆర్ మాటలను రాములమ్మ మరోసారి గుర్తు చేశారు. మహానుభావుడు అంబేద్కర్‌జీ వచ్చి.. విగ్రహం అడుగుతారా.? భవన్ అడుగుతారా? నేనియ్యకుంటే సీఎం దొరగారు భావిస్తున్నట్లు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలేమో.. అంటూ విజయశాంతి ఆరోపణలు సంధించారు.
ఇక మరో వైపు సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌కు మధ్య ఎలాంటి విరామం ఇవ్వొద్దని, దానిని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని రాములమ్మ సమర్ధించారు.
�