ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రకటించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ విషయంపై తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ పెట్టి..స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కావాలనే కరోనా సాకు చూపించి మరీ ఎన్నికలను వాయిదా వేయించిందని ఆరోపించారు సీఎం జగన్.

Also Read : విజయదేవరకొండ ఫస్ట్.. ఎన్టీఆర్ లాస్ట్

ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం జగన్ వ్యాఖ్యలను ఖండించింది. నామినేషన్లు వేసే టీడీపీ అభ్యర్థులపై దాడులు, మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయే తప్ప..తామేం కావాలని వాయిదా వేయించలేదన్నారు. బుధవారం సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో రంగులు కొట్టించుకున్న వైసీపీ..సుప్రీంలో కరోనా వాతలు పెట్టించుకుంది.

Also Read : కరోనా వచ్చి ఒకడేడుస్తుంటే ‘చలోనా’ అని ఒకడు ఆనందపడుతున్నాడు

కాగా..ఏపీ ఎన్నికల వాయిదా పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ”పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!” అని ట్వీట్ చేశారు.

దీనికి..ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ.. ”ఏం కాదు అంటున్నావు గా నువ్వూ ఆ తిక్కలోడు కలిసి తెలంగాణ ముక్కోడిని వెంటబెట్టుకొని జేబులో బ్లీచింగ్ నోట్లో పారాసెటమాల్ పెట్టుకొని wuhan(చైనా)పోండి. దేశం మొత్తం భయపడుతుంటే మీకు రాజకీయం కావాలా?” అని తిట్ల దండకం అందుకున్నాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.