ఎప్పటి లాగానే 2019 ఏడాదికి కూడా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను విడుదల చేసింది. ఆన్ లైన్ లో నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది హైదరాబాద్ టైమ్స్. 2018తో పోలిస్తే..2019లో టాలీవుడ్ హీరోలు తమ స్థాయిని కాస్త తగ్గించేసుకున్నారనే చెప్పాలి. హైదరాబాద్ టైమ్స్ వెల్లడించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 జాబితాలో ఈ సారి మన విజయదేవరకొండ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. 2018లో కూడా విజయ్ ఈ జాబితాలో మొదటి స్థానంలోనే ఉన్నాడు. ఫ్లాపులొచ్చినా..తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకర్షించి..తన స్థానాన్ని ఏ మాత్రం కోల్పోకుండా ఉండటం విశేషం. కాగా..2018లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మూడవ స్థానంలో ఉన్న రామ్ చరణ్..2019 లిస్ట్ లో 2వ స్థానాన్ని దక్కించుకున్నారు.

Also Read : చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

Ram Pothineni

చాక్లెట్ బాయ్ రామ్ గతేడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలో ఉన్న మాస్ యాంగిల్ ను కూడా చూపించాడు ప్రేక్షకులకి. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో 2018 జాబితాలో 11వ స్థానంలో ఉన్న రామ్..2019 లిస్ట్ లో 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Prabhas

బాహుబలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ గతేడాది విడుదలైన సాహో చిత్రంతో బోల్తా పడినట్లయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా..తొలి మూడ్రోజులు వసూళ్ల వర్షం కురిపించినప్పటికీ..భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. బాహుబలి విజయంతో 2018లో 2వ స్థానంలో ఉన్న ప్రభాస్..ఈ ఏడాది నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చే సినిమా అయినా ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందేమో చూడాలి.

Sudheer Babu

సుధీర్..2018లో విడుదలైన సమ్మోహనంతో ప్రేక్షకులను మెప్పించి..ఆ ఏడాది 14వ స్థానంలో ఉన్న ఈ హీరో..తాజాగా విడుదలైన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 8వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..గతేడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమాతో మంచి విజయన్నందుకున్నారు. 2018లో 16వ స్థానంలో ఉన్న అల్లు అర్జున్..2019 లిస్ట్ లో 12వ స్థానానికి ఎగబాకారు.

Junior Ntr

2018లో విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో కాస్త బెటర్ అనిపించకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ ఏడాది లిస్ట్ లో 9వ స్థానంలో ఉండగా..2019లో 19వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బహుశా 2019లో ఎలాంటి సినిమాలు లేకపోవడం వల్లే ఎన్టీఆర్ పతమై ఉండొచ్చని అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంతోనైనా మంచి విజయాన్నందుకోవాలని ఆశిద్దాం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.