రాష్ట్రంలో ఉంటే వైసిపి ఉండాలి.. లేదంటే టిడిపి ఉండాలి : విజయసాయి
By రాణి
రాష్ట్రంలో ఉంటే వైసిపి ఉండాలి లేదంటే టిడిపి ఉండాలి అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో విజయసాయి ఇన్ డైరెక్ట్ గా అన్ని పార్టీలకు కౌంటర్ ఇచ్చినట్లైంది. రాష్ట్రంలో వేరే పార్టీకి స్థానం లేదంటూ విజయసాయి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారానికి తెరలేపే విధంగా ఉన్నాయి.
Also Read : నాకు ఆ పాటే కావాలి..చిరు తాతతో నవిష్క
'' సోదరులారా మనమందరమూ వేరే పార్టీ వాళ్ళని ఎవరిని విమర్శించకూడదు. ఒక్క టిడిపి తప్ప..
ఇతర పార్టీ వాళ్ళు మనల్ని విమర్శించినా కూడా మనము వాళ్ళని టిడిపితో జతచేసి విమర్శించాలి.
రాష్ట్రంలో ఉంటే వైసిపి ఉండాలి.. లేదంటే టిడిపి ఉండాలి.. వేరే పార్టీ కి స్థానం లేదు!!'' అని విజయసాయి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. నీ ట్వీట్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాం అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Also Read : ఈ ఏడాది విద్యార్థులకు..వచ్చే ఏడాది నేరుగా తల్లుల ఖాతాలోకే..
విజయసాయి రెడ్డి ఎవరికి ఏం చెప్పాలనుకున్నా ఎక్కువగా ట్విట్టర్ వేదికగానే చెప్తారు. పైగా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ట్విట్టర్ ను బాగా వాడే రాజకీయ నేత ఎవరంటే విజయసాయి పేరే బాగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.