నాకు ఆ పాటే కావాలి..చిరు తాతతో నవిష్క

By రాణి  Published on  28 April 2020 11:44 AM GMT
నాకు ఆ పాటే కావాలి..చిరు తాతతో నవిష్క

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ తో తల్లికి పెసరట్లేసి పెట్టిన చిరు..ఇప్పుడు మనుమరాలితో కలిసి ఆడి పాడుతున్నారు. చిరంజీవికి మంచి హిట్ ఇచ్చిన ఖైదీ నంబర్ 150లోని యు అండ్ మి సాంగ్ నవిష్క ఫేవరెట్ సాంగ్ అట. ఆ పాట తప్పితే మరో పాట వినే ప్రసక్తే లేదంటోంది తాతగారితో.

Also Read : శంకరపల్లిలో తొలి కరోనా కేసు..

ఇక చిరంజీవి అయితే నవిష్క వచ్చి రాని ముద్దు ముద్దు మాటలు చూసి మురిసిపోతున్నారు. మళ్లీ అదే పాటేనా..ఇప్పుడేగా విన్నాం వేరే పాట విందాం అంటే గోల గోల చేస్తోంది నవి. ఆ పాట పెట్టేంతవరకూ ఊరుకోలేదు. మధ్యలో పాట ఆపేస్తే ఏడుపు ముఖం పెట్టి మిమిమి అంటూ పాట ప్లే చేయమని అడుగుతోంది. ఆ పాట పెట్టగానే నవ్వుతూ..కళ్లన్నీ టీవీలో పెట్టేసింది.

Also Read : ఈ ఏడాది విద్యార్థులకు..వచ్చే ఏడాది నేరుగా తల్లుల ఖాతాలోకే..

అలా మనుమరాలితో గడిపిన జ్ఞాపకాలను వీడియో తీసిన చిరు దానిని నెట్టింట్లో పోస్ట్ చేశారు. పాటలకున్న శక్తి చాలా అద్భుతం. ఈ చిన్నారి చూడండి పాటను ఎంతలా ఎంజాయ్ చేస్తోందో. ఆ పాటలో వస్తున్న డ్యాన్స్ మూవ్ మెంట్ లను కూడా ట్రై చేస్తోంది. నిజంగా నవిష్క చాలా ఎంజాయ్ చేస్తోంది అని రాశారు చిరు.Next Story